మధ్య ప్రదేశ్ లోని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లయింది. సోమవారం మధ్యాహ్నం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు బెంగళూరుకు చేరుకోవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరమైనది.
భోపాల్ నుంచి మూడు ప్రత్యేక చార్డెట్ ఫ్లైట్‌లో వీరిని జాగ్రత్తగా తరలించినట్లు తెలుస్తున్నది. వీరందరూ కూడా రెబెల్ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. ఈ రెబెల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని భోపాల్‌లో కాంగ్రెస్ వర్గాలలో అలజడి బైలు దేరింది.
అయితే ఈ మొత్తం వ్యూహానికి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియానే కారణమని ముఖ్యమంత్రి వర్గం ఆగ్రహంతో యూటిపోతున్నది. ఇంత జరుగుతున్నా కూడా ఆయన రాజధాని ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈ 18 మందిలో అత్యధికులు ఈయన వర్గం వారే కావడం విశేషం.

0 Comments