3. పంచభూతాలు - వాయువు ( గాలి)
కొద్దిగా పెద్దది కానీ చాలా చాలా చాలా ముఖ్యమైనది..
వాయువు లేదా వాయుదేవుడు లేదా గాలి మీరు ఎలా అయినా పిలవండి పంచభూతలలో ఒకటి అయిన గాలి ఎంత ముఖ్యమైనదో పెద్దాగా చెప్పక్కర్లేదు అనుకుంటా ఎందుకంటే జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ముందు అవి పనిచేయాలి, అనుభవించాలి అంటే ముఖ్యంగా కావాల్సింది వాయుదేవుని అనుగ్రహము ఎలా అంటే పీల్చిన గాలి వదలక పోయినా వదిలిన గాలి పీల్చక పోయినా ఈ శివం కాస్తా శవం అయిపోతుంది అంటే మనిషి చనిపోతాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా..
ఎందుకంటే భగవంతుడు మనకి ఆయుష్షు ఊపిరిల రూపంలో ఇస్తాడు..అంతేగాని రోజుల సంవత్సరాల లెక్క కాదు...అందుకే మన యోగులు, ఋషులు అద్భుతమైన వాయు స్తంభన విద్య, ప్రాణాయామం వంటి వాటితో వారి యొక్క ఉపిరిలు ఖర్చు తగ్గించుకుని వందల సంవత్సరాలు బ్రతుకుతారు..
అది వారి స్వార్ధం కోసం కాదు మనకి తెలియని ఎన్నో మంచి పనులు వాళ్ళు చాలా రహస్యంగా చేసేస్తారు వాటికి న్యూస్ పేపర్ మెయిన్ పేజీ లో ఫుల్ పేజీ యాడ్ అవసరం లేదు..ఇంకోసారి నిఘాడ విద్యలు మరియు హిమాలయ యోగులు ఎం చేస్తారు అనే వాటి గురించి మా గురుదేవుల అనుమతి ఇస్తే వివరించే ప్రయత్నం చేస్తాను...అలానే మనం నిద్రలో ఉండగా మన ఆస్ట్రల్ బాడీతో వాయు గమనం చేసి రహస్య విద్యలు, వందల సంవత్సరాలు చదివినా నేర్చుకోలేని జ్ఞానాన్ని నేర్పించే రహస్య విధానాలతో ఇప్పటికీ ప్రతిరోజు నడిచే ఒక విశ్వ విద్యాలయం గురించి అక్కడికి వెళ్లి నేర్చుకునే విధానం గురించి కూడా తెలియచేస్తాను..అనుమానాలు అవసరం లేదు ప్రయత్నించి చూడండి మన సనాతన ధర్మం మీద నమ్మకం, భక్తి ఉన్నవాళ్ళకి మాత్రమే..
అలాగే మిలో కొంతమందికి తెలియని అద్భుతమైన విషయాలు మనం వాయుదేవుడి గురించి తెలుసుకుందాం...
వాయువు విపరితమైన శక్తి కి బలానికి (tremendous strength) కారణం...అందుకే స్వామి హనుమ మరియు భీముడు వాయు దేవుని కుమారులుగా చెప్తారు..
అందుకే ఏదైనా పని మొదలు పెట్టె అప్పుడు మీ శక్తికి మించిన పని అయితే హనుమకి 3 కొబ్బరికాయలు కొట్టి ప్రారంభిస్తే దానికి కావాల్సిన శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తారు అంటారు...
మన శరీరంలో 5 ప్రధాన వాయువులు, 5 ఉప వాయువులు ఉంటాయి...అవి
ప్రాణ, అపాన, ఉదానా, సమాన, వ్యాన.
నాగ, కుర్మ, కృకర, ధనుంజయ, దేవదత్త అనబడే వాయువులు నిరంతరము వాటి పని చేస్తుంటేనే మనం ఏదైనా చెయ్యగలం వాటి వివరణ ఇప్పుడు అంతగా అవసరం లేదు...
ఒకవేళ మీకు మనలో పీల్చే గాలి కాకుండా ఇంకా వాయువులు ఎలా ఉంటాయి అని అనుమానం ఉంటే రెండు చెవులలో వేళ్ళుతో మూసి చూడండి మీకు సముద్ర ఘోష లా ఆ వాయువు వినపడుతుంది.అసలు మనం కనురెప్ప వెయ్యాలి అన్నా వాయువే కారణం..
అలానే జాతకంలో వాయు తత్వ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టినవాళ్ళు ఎక్కువ శక్తి సామర్ధ్యాలు కలిగి చాలా తేలికగా పైకి వస్తారు...
మిధున, తుల, కుంభ రాశులు వాయుతత్వ రాశులు..
అందుకే మిధున రాశి వాయుతత్వం పైగా బుధుడికి, తెలివితేటలకి కారణం కాబట్టి వీళ్ళకి ఊహా శక్తి ఆమోఘంగా ఉంటుంది దానికి ఇతర గ్రహాల కలయిక బట్టి వీరు మంచి రచయితలు అవుతారు...మిధునానికి సంబంధం లేకుండా 99% రచయితలు కావడం అసంభవం....
గాలి ఎంత తేలికైనధో అన్ని రేట్లు బలమైనది కనుక మనలో శక్తి సామర్ధ్యాలు పెరగాలి అన్నా మన కీర్తి దశ దిశలు విస్తరించాలి అన్నా వాయు ఆరాధన చెయ్యండి.
వాయు ఆరాధన వల్ల తేలికగా అభివృద్ధి చెందుతారు..
అలానే గాలిని కాలుష్యం చెయ్యకండి..( సిగరెట్లు, వాహనం లోంచి పుగ రూపంలో వచ్చే కాలుష్యం వంటి వాటిని అరికట్టండి.)..
బయట ఉన్న పరిశ్రమలు వాటిని మనం ఏమి చేయలేము కాబట్టి మనం ఉండే మన ఇల్లు, వ్యాపార స్థలం వాటిలో మీరు ఉండే చోటుని అక్కడ ఉండే గాలిని శుభ్రం చెయ్యండి..అంటే సాంబ్రాణి పొగ వెయ్యటం, లేదా ఆవు పీడక మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి వెలిగించడం అది కుదరని వాళ్ళు హారతి కర్పూరం, అగరబత్తి వెలిగించడం చెయ్యండి..మిలో ఉండే వాయు దోషాలు తొలగి పోతాయి అలానే ఎప్పుడూ మీ చుట్టు గాలిలో దైవనామం వినపడేలా చూసుకోండి (మొబైల్, టేప్ రికార్డర్ లో)..ఇలా కూడా మీవంతు గాలిని పరిశుద్ధం చెయ్యండి...
ఈసారి ఎప్పుడు ఏదైనా పురాతన గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి వాయువ్య భాగంలో పరిమళాలు వచ్చే విధంగా చెయ్యండి..మీకు తోచిన విధంగా...
జాతకంలో శని,కుజ,చంద్ర,శుక్ర గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నా చెప్పిన పరిహారాలు చేసుకోండి..అలానే ఇంటిలో వాయువ్య దిశలో దోషాలు ఉంటే సరి చేసుకోండి...
అలానే శ్రీకాళహస్తి వాయు లింగమే కనుక దర్శనం చేసుకోండి....
" వేదం మన భారతీయ సనాతన ధర్మం"




0 Comments