మీ బలం ఎవరికి చూపిస్తున్నారు ? ౼ రాజ్ థాకరే
పౌరసత్వ సవరణ చట్టం(CAA) కి వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్న ఆందోళనపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రశ్నల వర్షం కురిపించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో వారికి సంబంధం లేకపోయినా ఎందుకు దానిపై ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఈ చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులను తక్షణమే దేశం నుంచి వెనక్కి పంపేయాలంటూ ఎంఎన్ఎస్ నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ థాకరే ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘‘సీఏఏతో ముస్లింలకు సంబంధం లేకపోయినా వాళ్లెందుకు ఆందోళన చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. ఎవరికి చూపిస్తున్నారు మీ బలం?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం ట్రస్టు ఏర్పాటు, సీఏఏ అమలు వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రంపై ఆయన ప్రశంసలు కురిపించారు.


0 Comments