తెలంగాణ లెక్క చెప్పిన కేంద్రం
గత ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులకు సంబంధించిన వివరాలను లోక్ సభలో కేంద్రం వివరించింది. ఆరేళ్లలో పన్ను వాటా కింద రూ.85,113 కోట్లు రాష్ట్రాల విపత్తుల నిధులు కింద రూ.1289.4 కోట్లు స్థానిక సంస్థల నిధులు కింద రూ.6,511 కోట్లు వెనుకబడిన జిల్లాలకు రూ.1,996 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు ప్రజాహిత పథకాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.51,268.84 కోట్లు, మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 ఇచ్చామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ గారు వివరించడం జరిగింది